భారత్- ఆస్ట్రేలియాల మధ్య జరుగుతున్న బాక్సింగ్ డే టెస్టు రెండో ఇన్నింగ్స్‌లో భారత బ్యాట్స్‌మెన్ తడబడుతున్నారు. మూడో రోజు ఆట ముగిసే సమయానికి టీమిండియా 5 వికెట్ల నష్టానికి 54 పరుగులు చేసింది. తొలి ఇన్నింగ్స్‌లో భారీ స్కోరు చేసి దూకుడు మీదున్న కోహ్లీసేనను పైన్ సేన రెండో ఇన్నింగ్స్‌లో అడ్డుకుంది. పుజారా, కోహ్లీ డకౌట్ అవ్వడంతో భారీ లక్ష్యాన్ని ఆతిథ్య జట్టు ముందుంచే అవకాశం దాదాపుగా టీమిండియా చేజారినట్లయింది. పాట్ కమిన్స్ నాలుగు వికెట్లు, హేజిల్‌వుడ్ ఒక వికెట్ తీసి టీమిండియా బ్యాట్స్‌మెన్ దూకుడును అడ్డుకున్నారు. దీంతో కోహ్లీసేన మూడో రోజు ఆట ముగిసే సమయానికి 54 పరుగులు చేసింది. ప్రస్తుతం టీమిండియా 346 పరుగుల ఆధిక్యంలో ఉంది.
తొలి ఇన్నింగ్స్‌లో ఆసీస్ 151 పరుగులకే ఆలౌటయిన అనంతరం ఆ జట్టుతో ఫాలోఆన్ ఆడించేందుకు టీమిండియా నిరాకరించి రెండో ఇన్నింగ్స్ మొదలు పెట్టింది. చాలా సేపటివరకు నిలకడగా ఆడిన టీమిండియా ఓపెనర్లను పాట్ కమిన్స్ విడగొట్టాడు. 13 ఓవర్లో కమిన్స్ వేసిన బంతిని ఖవాజాకు క్యాచ్ ఇచ్చి హనుమ విహారి(13) పెవిలియన్ చేరాడు. అప్పటి నుంచి టీమిండియా వికెట్ల పతనం మొదలైంది. తర్వాత బ్యాటింగ్‌కి దిగిన పుజారాను 15ఓవర్లో పాట్ కమిన్స్ డకౌట్ చేశాడు. అదే ఓవర్లో టీమిండియా సారథి కోహ్లీ సైతం కమిన్స్ బౌలింగ్‌లోనే డకౌట్ అయ్యాడు. 16వ ఓవర్లో కమిన్స్ బౌలింగ్‌లోనే రహానె(1).. పైన్‌కు క్యాచ్ ఇచ్చి పెవిలియన్ చేరాడు. అప్పటికి జట్టు స్కోరు 33 పరుగులు మాత్రమే. అయితే తర్వాత బ్యాటింగ్‌కు దిగిన రోహిత్ శర్మ కాసేపు క్రీజులో నిలబడినప్పటికీ స్కోరు మాత్రం పెరగలేదు. 23 ఓవర్లో హేజిల్ వుడ్ బౌలింగ్‌లో షాన్ మార్ష్‌కు క్యాచ్ ఇచ్చి రోహిత్ వెనుదిరిగాడు. దీంతో మూడో రోజు ఆట ముగిసే సమయానికి టీమిండియా 54/5 పరుగులు మాత్రమే చేసింది. అయితే మరో ఎండ్‌లో ఉన్న బ్యాట్స్‌మెన్ పెవిలియన్‌కు క్యూ కడుతున్నప్పటికీ మయాంక్ మాత్రం నిలకడగా రాణిస్తున్నాడు. ప్రస్తుతం మయాంక్(28; బ్యాటింగ్), పంత్(1; బ్యాటింగ్) క్రీజులో ఉన్నారు.