గీత గోవిందం చిత్రం కథ ,విజయ్ దేవరకొండ,రేష్మిక ,geetha govindham telugu movie story ,vijay,reshmika
మొదట్లో లైఫ్ ఈజ్ బ్యూటిఫుల్, ఎవడే సుబ్రహ్మణ్యం చిత్రాలతో అక్కడక్కడా చిన్న రోల్స్ చేస్తూ వచ్చిన విజయ్ దేవరకొండ, ఆ తరువాత తరుణ్ భాస్కర్ దర్శకత్వంలో వచ్చిన పెళ్లి చూపులు చిత్రంతో హీరోగా మారాడు. ఆ చిత్రం మంచి విజయవంతం అవడంతో, తన తదుపరి చిత్రాన్ని సందీప్ రెడ్డి వంగ దర్శకత్వంలో చేసాడు విజయ్. అదే అర్జున్ రెడ్డి, ఆ చిత్రంతో ఒక్కసారిగా ఓవర్ నైట్ స్టార్ గా ఎదిగిన విజయ్ అక్కడినుండి యువతలో మంచి క్రేజ్ సంపాదించాడు. ఇక ఆ తరువాత చేసిన ఏం మంత్రం వేశావే సినిమా నిరాశ పరచడంతో, ఇక అప్పటినుండి తన కెరీర్ ని జాగ్రత్తగా ప్లాన్ చేస్తూ వస్తున్న విజయ్ ప్రస్తుతం సోలో ఫేమ్ పరశురామ్ దర్శకత్వంలో చేసిన సినిమా గీత గోవిందం. బన్నీ వాసు నిర్మాతగా గీత ఆర్ట్స్-2 బ్యానర్ పై ఈ చిత్రం రూపొందింది. నేడు ప్రేక్షకుల ముందుకు వచ్చిన ఈ చిత్రం టాక్ ఎలా ఉందొ తెలుసుకుందాం. కథ విషయానికి వస్తే, ఒక కాలేజీలో అసిస్టెంట్ ప్రొఫెసర్ గా పని చేస్తున్న విజయ్ గోవింద్ (విజయ్ దేవరకొండ),
తన వెంట ప్రేమ పేరుతో పడుతున్న అమ్మాయిని లెక్క చేయదు, అంతేకాక తనకు కలలో ఒక అమ్మాయి (గీత)ని ఊహించుకుంటూ ఉంటాడు. అయితే అనుకోకుండా ఆ అమ్మాయి నిజంగానే బయట ఒక గుడిలో తనకు కనపడడం జరుగుతుంది. కానీ, ఆ తరువాత ఆ అమ్మాయి అనుకోకుండా జరిగే ఒక బస్సు ప్రయాణంలో ఒక దుర్ఘటన వల్ల గోవింద్ ని అసహ్యించుకుంటుంది. జరిగిన ఆ ఘటన ఏమిటి, అసలు ఆ అమ్మాయి గోవింద్ ని ప్రేమిస్తుందా, విజయ్ ఆమెను ఏ విధంగా ఒప్పించి పెళ్లి చేసుకుంటాడు, ఎలా చివరకు వాళ్ళ కథ సుఖంతం అవుతుంది అనేది మిగతా కథ. ముందుగా విజయ్ గోవింద్ గా విజయ్ దేవరకొండ తన క్యారెక్టర్ లో సెట్టిల్డ్ పెర్ఫార్మన్స్ తో అందరిని ఆకట్టుకున్నాడు అనే చెప్పాలి, కొంత ఎంటర్టైనింగ్ అండ్ ఫన్ తో కూడిన అతని క్యారెక్టర్ తో ప్రేక్షకులు బాగానే కనెక్ట్ అవుతారు. ఇక గీత గా రేష్మిక తన హావభావాలతో, హీరో తనను లవ్ లో పడేయాలని చూసే సన్నివేశాల్లో ఆమె నటన చాలా బాగుంటుంది.
హీరో తండ్రి పాత్రలో నటించిన నాగబాబు నటన బాగుంది, కమెడియన్స్ వెన్నెల కిశోరె మరియు రాహుల్ రామకృష్ణలు వారి సీన్స్ మేరకు బాగానే కామెడీని పండించారు. ఇక సినిమా ఫస్ట్ హాఫ్ మొత్తం మంచి ఎంటర్టైన్మెంట్ మరియు ఫన్నీ గా సాగుతుంది. ఇక సెకండ్ హాఫ్ బెగిన్నింగ్ బాగున్నప్పటికీ మధ్యలో వచ్చే కొన్ని సన్నివేశాలు మాత్రం కృతకంగా అనిపిస్తాయి. ఇక కథనం కూడా కాస్త నెమ్మదిగా సాగుతున్నట్లు అనిపిస్తుంది. కానీ అక్కడక్కడా వచ్చే కొన్ని సన్నివేశాలు పర్వాలేదనిపిస్తాయి. ఇక సినిమాలో గోపి సుందర్ సంగీతం ఆకట్టుకోగా, మణికంధన్ సినిమాటోగ్రఫీ సినిమాకి ప్రధాన ఆకర్షణగా చెప్పుకోవాలి. ఇకపోతే నిర్మాతలు సినిమాని బాగా లావిష్ గా తెరకెక్కించారని చెప్పుకోవాలి. మొత్తంగా చూస్తే ఈ గీత గోవిందం, సదరు ప్రేక్షకుడిని చాలావరకు అలరిస్తుంది అని చెప్పవచ్చు. ఫస్ట్ హాఫ్ బాగున్నా, సెకండ్ హాఫ్ లో అక్కడక్కడా కొంత బోరింగ్ గా అనిపించినా ఓవర్ అల్ గా మాత్రం గీత గోవిందం మంచి ఎంటర్టైనింగ్ గా సాగె రొమాంటిక్ మూవీగా చెప్పుకోవచ్చు….
Subscribe to:
Comments (Atom)
Iphone 11 pro ,iphone 11, iphone 11 pro max specifications , price, available now
iPhone 11 Pro and iPhone 11 Pro Max: the most powerful and advanced smartphones Featuring a Stu...
-
World Cup TEAM M W L T N/R PT NRR FOR AGAINST 1 New Zealand 3 3 0 0 0 6 2.163 558/95.3 552/150.0 2 England 3 2 1 0 0 4 1.307 1031/15...
-
saina nehwal Saina Nehwal (About this soundpronunciation (help·info), born 17 March 1990) is an Indian professional badminton singl...
-
India's first Test series in Australia The historic series won by 2-1. Virat Kohli was the first Asian captain to win the series agains...

















































































































































