ప్రపంచ టూర్ ఫైనల్స్ టైటిల్ గెలిచిన తెలుగు తేజం పీవీ సింధుకు అభినందనలు. తెలంగాణతో పాటు దేశం నిన్ను చూసి గర్విస్తోంది’’
- తెలంగాణ సీఎం కేసీఆర్
‘‘ఒకుహరా లాంటి బలమైన ప్రత్యర్థిని ఓడించి సింధు టైటిల్ గెలవడం అభినందనీయం. భవిష్యత్తులో సింధు మరిన్ని విజయాలు సాధించాలి’’
- ఏపీ సీఎం చంద్రబాబు నాయుడు
ఒలింపిక్స్‌లో రజతం.. ప్రపంచ ఛాంపియన్‌షిప్‌లో రజతం.. ఈ ఏడాది ఏకంగా ఏడు ఫైనల్స్‌లో ఓడిపోయి రజతం తెచ్చుకుంది తెలుగమ్మాయి పి.వి.సింధు. ఏ టోర్నీకి వెళ్లినా రెండో స్థానమే. మళ్లీ అదే పేరు సిల్వర్ స్టార్ అని! కానీ ఏడాది చివరిలో సింధు ఫైనల్ అడ్డంకిని దాటి విజేతగా నిలిచింది. ప్రపంచ టూర్ ఫైనల్స్ టోర్నీలో పసిడి గెలిచి ఒక పెద్ద టోర్నీలో టైటిల్ గెలవలేదనే అపప్రథను తుడిచిపెట్టింది. ఆదివారం హోరాహోరీగా సాగిన ఫైనల్లో సింధు.. చిరకాల ప్రత్యర్థి ఒకుహరను ఓడించి టైటిల్ గెలిచింది.
తెలుగమ్మాయి పూసర్ల వెంకట సింధు చరిత్ర సృష్టించింది. బీడబ్ల్యూఎఫ్ ప్రపంచ టూర్ ఫైనల్స్ టైటిల్ చేజిక్కించుకుంది. ఈ ఘనత సాధించిన తొలి భారత క్రీడాకారిణిగా నూతన అధ్యాయం లిఖించింది. ఆదివారం జరిగిన మహిళల సింగిల్స్ ఫైనల్లో సింధు 21-19, 21-17తో చిరకాల ప్రత్యర్థి, రెండో సీడ్ నొజొమి ఒకుహర (జపాన్)ను వరుస గేమ్‌ల్లో చిత్తుచేసింది. నిరుడు ప్రపంచ ఛాంపియన్‌షిప్ ఫైనల్లో ఎదురైన ఓటమికి ఒకుహరపై బదులు తీర్చుకుంది. సింధు కెరీర్‌లో ఇది 14వ టైటిల్ కాగా.. ఈ ఏడాది సాధించిన మొదటి టైటిల్. 2017 సెప్టెంబరు నుంచి ఇప్పటి వరకు సింధు ఏడు టోర్నీల్లో ఫైనల్స్ చేరుకోగా.. ఏడింట్లోనూ ఓడి రన్నరప్‌గా నిలిచింది. బీడబ్ల్యూఎఫ్ టైటిల్‌తో ‘ఫైనల్ ఫోబియా’కు తెరదించినట్లయింది.
62 నిమిషాల పాటు సాగిన మ్యాచ్‌లో మొదటి పాయింటు నుంచి చివరి వరకు సింధుదే ఆధిపత్యం. 2 గేమ్‌ల్లో కలిపి ఒక్కసారి కూడా సింధు వెనుకబడలేదు. ఒకదశలో పాయింట్లు సమమైనా.. ఆధిక్యం మాత్రం సింధుదే. తొలి గేమ్ ఆరంభంలో ఒకుహర అనవసర తప్పిదాలతో తడబడింది. సింధు మాత్రం షటిల్‌పై పూర్తి నియంత్రణతో ఆడింది. డ్రాప్ షాట్లతో అలరించింది. నెట్ దగ్గర అద్భుతంగా ఆడుతూ ప్రత్యర్థికి సవాళ్లు విసిరింది. సుదీర్ఘమైన ర్యాలీలతో ఒకుహరకు ఊపిరి ఆడనివ్వలేదు. చూస్తుండగానే సింధు 11-6తో ఆధిక్యంలోకి దూసుకెళ్లింది. విరామానంతరం సింధు జోరు కొనసాగింది. వరుస పాయింట్లతో ఆధిక్యాన్ని 14-6కు పెంచుకుంది సింధు. వెంటనే పుంజుకున్న ఒకుహర వరుసగా 4 పాయింట్లతో సింధు ఆధిక్యాన్ని 10-14కు తగ్గించింది. అక్కడ్నుంచి ఇరువురు నువ్వానేనా అన్నట్లు తలపడ్డారు. ఒకుహర దూకుడుగా ఆడుతూ 16 పాయింట్ల వద్ద సింధును అందుకుంది. నువ్వానేనా అన్నట్టుగా పోరు సాగుతున్న సమయంలో ఎంతో ప్రశాంతంగా ఆడిన సింధు కీలక సమయంలో పాయింట్లు గెలిచి 21-19తో తొలి గేమ్ ఖాతాలో వేసుకుంది.
రెండో గేమ్‌ను సింధు దూకుడుగా ఆరంభించగా.. ఒకుహర ర్యాలీ గేమ్ ఆడింది. సుదీర్ఘ ర్యాలీలతో సింధు తప్పులు చేసేలా చేసింది. ఒకుహర వ్యూహం ఫలించి 7-7తో పాయింట్లు సమమయ్యాయి. సింధు మాత్రం ప్రత్యర్థికి ఆధిక్యం సాధించే అవకాశం ఇవ్వలేదు. ఒకుహర ఎంత ప్రయత్నించినా సింధుపై ఆధిపత్యాన్ని ప్రదర్శించలేకపోయింది. కాకపోతే 16 పాయింట్ల వరకు సింధు వెన్నంటే నిలిచింది. స్మాష్‌లు, డ్రాప్ షాట్లతో ఇరువురు పాయింట్లు రాబట్టారు. గేమ్‌లో ఓ ర్యాలీ 47 షాట్‌లు సాగడం విశేషం. 17-16 పాయింట్ల వద్ద గేమ్ మలుపు తిరిగింది. ఒకుహర షటిల్‌ను నెట్‌కు ఆడటంతో 18-16తో సింధు ముందంజ వేసింది. ఆ వెంటనే సుదీర్ఘంగా సాగిన ర్యాలీకి ఒకుహర దగ్గర జవాబు లేకపోయింది. సింధు తెలివిగా సంధించిన స్మాష్‌ను ఒకుహర అందుకోలేకపోయింది. 19-16తో రెండో గేమ్‌కు సింధు చేరువైంది. ఒకుహర ఒక పాయింటు నెగ్గి సింధు ఆధిక్యాన్ని 17-19కి తగ్గించింది. ఐతే షటిల్ నెట్‌కు తగిలి అవతలి కోర్టులో పడటంతో 20-17తో సింధు విన్నింగ్ పాయింటుకు చేరువైంది. అదే జోరులో మరో పాయింటు గెలిచి 21-17తో చరిత్ర సృష్టించింది. పురుషుల సింగిల్స్‌లో షియుకి (చైనా) టైటిల్ గెలిచాడు.

No comments:
Post a Comment